Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రాంచరణ్ సందడి

Hero Ramcharan in Sharvanand prewedding celebrations
Advertisement
  • జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో హీరో వివాహం
  • సంగీత్ వేడుకల్లో సందడి చేసిన హీరోలు రాంచరణ్, అఖిల్, రానా
  • రాత్రి 11:30 గంటలకు రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్న శర్వానంద్
Advertisement
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ రోజు రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్, హీరో రాంచరణ్ సందడి చేశారు. రాంచరణ్ తో పాటు ఇండస్ట్రీలో శర్వానంద్ తో సన్నిహితంగా ఉండే హీరోలు అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

పెళ్లి వేడుకల కోసం లీలా ప్యాలెస్ ను సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు శర్వానంద్, వధువు రక్షిత కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు శుక్రవారం ఉదయానికే జైపూర్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేయనున్నాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితతో శర్వానంద్ కు జనవరి 26న ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
Sharvanand
wedding
jaipur
leela palace
prewedding celbrations
Tollywood

More Telugu News